Tuesday, January 8, 2019

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్



0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు
0-2 = బ్లౌజ్ పొడవు + కచ్చు
2-3 = భుజము/2 +1/2"
3-4 = భుజము క్రాస్ (1/4')
4-5 = ఛాతి చుట్టుకొలత /4 - 1/2"
6-7 = గీత గీసుకోవాలి
6-8 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు
2-9 = నడుము పొడవు +1/2"
9-10 = నడుము చుట్టుకొలత /4 + లూజు
0-11 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1
 (ఇక్కడ 1" తీసుకోవడము , తీసుకోకపోవడము అనేది మనఇష్టము .
 కొంచము వెడల్పు కావాలిఅనుకుంటే 1" తీసుకోవచ్చు. )
2-A = మెడ వెడల్పు (ఛాతి చుట్టుకొలత/12)
2-B = మెడ పొడవు 1&1/2"
a = 9-10 మధ్య పాయింట్
a-b = a-c = 1/2"
a-d = a-e = 4"

పట్టు లంగా బ్లౌజ్ ముందు బాడీ డ్రాఫ్టింగ్ 



0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు
0-2 = బ్లౌజ్ పొడవు + కచ్చు
2-3 = భుజము/2 +1/2"
3-4 = భుజము క్రాస్ (3/4')
4-5 = ఛాతి చుట్టుకొలత /4 -1"
6-7 = గీత గీసుకోవాలి
6-8 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు
9 = 4-5 కి మధ్య పాయింట్
9-10 = 1/2"  or  1/4"
2-11 = నడుము పొడవు +1/2"
11-12 = నడుము చుట్టుకొలత /4 + లూజు
0-13 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1
 (ఇక్కడ 1" తీసుకోవడము , తీసుకోకపోవడము అనేది మనఇష్టము .
 కొంచము వెడల్పు కావాలిఅనుకుంటే 1" తీసుకోవచ్చు. )
2-A = మెడ వెడల్పు (ఛాతి చుట్టుకొలత/12)
2- B = ఛాతి చుట్టుకొలత/6  or  ఛాతి చుట్టుకొలత/8
a = 11-12 మధ్య పాయింట్
a-b = a-c = 1/2"
a-d = a-e = 4"

చెయ్యి డ్రాఫ్టింగ్ : 




0-1= చంక చుట్టుకొలత/2 + 1"
0-2 = చెయ్యి పొడవు + కచ్చు
2-3 = చంక చుట్టుకొలత/12 +1/2"
3 దగ్గర ఒక లైన్ గీసుకోవాలి
2-4 = చంక చుట్టుకొలత/2 -1/4"
5 = 2-4 కి మిడ్ పాయింట్
5-6 = 1/2"
2-7 = 3/4"
4-8 = 1/2"
2,7,6,8 పాయింట్స్ ను కలుపుకోవాలి
9 = 4-5 కి మిడ్ పాయింట్
9-10 = 1/2"
2,7,5,10,8,4 పాయింట్స్ ను కలుపుకోవాలి
0-11 =  చెయ్యి లూజు
1-11 = కచ్చు

డ్రాఫ్టెడ్ పేపర్ పైన డ్రా చేసుకునే విధానాన్ని ఈ క్రింది వీడియో లో చూడొచ్చు .
https://www.youtube.com/watch?v=2t8ClNMSUyc&feature=youtu.be

Tuesday, January 1, 2019

పట్టు పావడ ను కొట్టుకునే విధానము

మనము పండుగ  అనగానే ఆడపిల్లలకి పట్టు పావడ వేయటం సంప్రదాయం. ఈ పట్టు వస్త్రాలలో పిల్లలు బుట్ట బొమ్మలా చక్కగా ఉంటారు.

కావలసిన వస్తువులు:

పట్టు పావడ
లైనింగ్
దారము
టేపు
శరీర కొలతలు
క్లాత్ మార్కర్
పిన్స్ లేదా గుండుసూదులు
కత్తెర

కావలసిన శరీర కొలతలు :



ఇక్కడ నేను చూపించే పట్టుపావడ చిన్న పిల్లలది. కావున దీనికి మనము బాడీ తో కుట్టుకుంటాము .
ఇందులో 3 భాగాలూ ఉన్నాయి .
1. పట్టు లంగా  కుట్టుకోవడం
2. బాడీ కుట్టుకోవడం
3. బ్లౌజ్ కుట్టుకోవడం

1. పట్టు లంగా కుట్టుకునే విధానము :


- ముందుగా పట్టు పావడ మెటీరియల్ లో నుంచి బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి.
- ఇపుడు పావడ ని తీసుకొని దాని పొడవు మరియు వెడల్పూ కొలుచుకోవాలి .
- పావడ పొడవు ఎక్కువ ఉన్నటైతే మడిచి కుట్టుకోవాలి.

- పావడ వెడల్పు ను మన నడుము చుట్టుకొలతలతో భాగించుకోవాలి . అలా వచ్చినదాన్ని 3 తో భాగించుకోని ఎంత ఐతే వచ్చిందో దానిని పావడ పైన మార్క్ చేసుకుంటూ రావాలి .
- ఆలా మార్క్ చేసుకున్న తరువాత నార్మల్ ప్లిట్స్ గుండు సూదులను ఉపయోగించి పెట్టుకుంటూ రావాలి.
- ఇలా పెట్టుకున్న ప్లిట్స్ మనము తీసుకున్న నడుము కొలతకు సరిపోతుందో లేదో సరి చూసుకోవాలి.
- ఇప్పుడు  లొంగ ప్లిట్స్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి.
- తరువాత లంగా సైడ్స్ ను కుటుకోవాలి.

ఈ లంగా కొట్టుకునే విధానమును ఈ క్రింది వీడియో లింక్స్ లో చూడగలరు.

 2. బాడీ కొట్టుకునే విధానము :

a. పట్టు లంగా బాడీ ని  డ్రాఫ్టింగ్ చేసుకునే విధానము.



ఈ బాడీ డ్రాఫ్టింగ్ మరియు కటింగ్ , లంగా కొట్టుకునే విధానమును ఈ క్రింద వీడియో లింక్ లో చూడగలరు. 

https://youtu.be/mxyN79fMnzA

https://youtu.be/WgHC02PlE5U

https://youtu.be/zzRUzYP9RWo


పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ , కటింగ్ మరియు స్టిచ్చింగ్ ను మరియొక్క పోస్ట్ లో చూడగలరు. 
దీని పై గ మీ అమూల్య మైన అభిప్రాయాలను కామెంట్స్ లో ఇవ్వగలరు. 



Wednesday, December 19, 2018

basic baking

బేసిక్ బేకింగ్

బేకింగ్ అంటే కాల్చటం. కేక ను బేక్ చేసేటపుడు మనము ఒవేన్ లో పెడుతాము. ఒవేన్ అంటే మంట లేకుండా అన్ని వైపుల వేడిని ఇస్తుంది. ఈ ఒవేన్ లో మనము టెంపరేచర్ ను పదార్తాన్ని బట్టి సెట్ చేసుకో వచ్చు. ఒక వేళా ఒవేన్ లేకపోతె మన పాతపద్ధతిలో మట్టి పాత్ర, లేదా ఏదైనా మందపాటి పాత్ర లో ఇసుక, లేదా ఉప్పు ను వేసుకొని, కేకును కానీ, కుక్కీస్ ఉన్న పాత్ర ను పెట్టుకొని పైన మూత పెడుతాము. ఇలా చేయడం వలన వేడి అనేది అన్ని వైపులా వచ్చి మనము ఉంచిన పదార్దములు బేక్ అవుతాయి. 
బేకింగ్ అనేది ఒక సైన్స్ . ఇందులో మంచి రిజల్ట్స్ కోసం ప్రతిదీ మనము కొలత ప్రకారము చేయాలి.
ముందుగా మనము బేసిక్ బేకింగ్ ను నేర్చుకుందాము .
ఇందులో రకరకాల కేక్స్  యొక్క బేస్ ని తయారుచేయటం మరియు వాటిని రాకరాకల క్రీమ్స్ తో డెకరేట్ చేయటం అన్ని నేర్చుకోవచ్చు.

బేసిక్ బేకింగ్ లిస్ట్ :

1. వెనిల్లా  కేక్ (vanilla cake)
2. చాక్లెట్ కేక్ (chocolate cake)
3.. ఎగ్ లెస్ వెనిల్లా కేక్(egg less vanilla cake) 
4. ఎగ్ లెస్ చాక్లెట్ కేక్( egg less chocolate cake)
5. పైన్ ఆపిల్ పేస్ట్రీ (pine apple pastry)
6. బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ (black forest pastry)
7. పైన్ ఆపిల్ అప్ సైడ్ డౌన్ కేక్ (pine apple upside down cake)
8. క్యారట్ డేట్స్ కేక్ (carrot and dates cake)
9. కోకోనట్ స్నో కేక్ (cocnut snow cake)
10. ప్లమ్ కేక్ (plum cake)
11. ట్రఫిల్ కేక్ (truffle cake)
12. ఆపిల్ కేక్(apple cake) 

కుకీస్ (cookies):

1. చాంద్ బిస్కట్స్ (chand biscuts)
2. చాకోలెట్ చిప్ కుకీస్ (chocolate chip cookies)
3. ఆరంజ్ చాకొలేట్ చిప్ కుకీస్ (orange chocolate chip cookies)
4. పీనట్ బట్టర్ క్రింకెల్స్ ( peanut butter crinkeles)
5. షుగర్ కుకీస్ (sugar cookies)

కప్ కాక్స్ (cup cakes)
కప్ కేక్ పాప్స్ (cupcakes pops)

డెకరేషన్స్ :(forstings)
1. విపింగ్  క్రీం ఫారెస్టింగ్ (whipping cream forsting)
2. బట్టర్ క్రీం ఫారెస్టింగ్ (butter cream forsting)
3. గణాన్స్ ఫోరెస్టింగ్ (ganche forsting)

ఈ పై లిస్ట్ లో ఉన్నవి అన్ని బేసిక్ బేకింగ్ లో నేర్పిస్తారు. 



pony theme fondant cake






Pony థీమ్ ఫాండన్ట్ కేక్  మా అమ్మాయి పుట్టిన రోజు కి చేశాను 



ఫ్రొక్స్



ఈ మధ్య కాలములో నేను స్టిచ్ చేసిన ఫ్రొక్స్ 







Monday, April 9, 2018

కుర్తీ సోల్డర్ ఆల్ట్రేసన్స్ ను చేయు విధానము


కుర్తీ సోల్డర్ ఆల్ట్రేసన్స్ ను చేయు విధానము ఈ క్రింది లింక్ లో చూడగలరు






https://www.youtube.com/edit?video_referrer=watch&video_id=iQk3y2UuZxA

thank you

బేసిక్ బాడి డ్రాఫ్టింగ్ ను డ్రా చేయు విధానము



బేసిక్ బాడి డ్రాఫ్టింగ్ ను డ్రా చేయు విధానము ఈ క్రింది లింక్ లో చూడగలరు

https://www.youtube.com/watch?v=cieBFvxxcKM

thanks for watching



Sunday, November 26, 2017

కిడ్స్ బేసిక్ బాడీ డ్రాఫ్ట్

కిడ్స్ బేసిక్ బాడీ డ్రాఫ్ట్ 

పిలల్ల కి మార్కెట్ లో రకరకాల ఫ్రాక్స్ దొరుకుతున్నాయి. రెడీ మేడ్స్ అందరికి ఫిట్ అవకపోవచ్చు. ఎంత దొరికిన మనము కుట్టిన వి వాళ్లకు వేసినపుడు వచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేము. 
ఈ బేసిక్ డ్రాఫ్ట్ ను ఉపయోగించి కిడ్స్ యొక్క పట్టు పావడ, అన్ని రకాల ఫ్రాక్స్ ను డిజైన్ చేయవచ్చు. 

కిడ్స్ యొక్క స్టాండర్డ్ సైజు పట్టిక 


AGE
3-9 MNTS 
1 YR 
2 YR 
3 YRS 
4 YRS 
5 YRS 
6 YRS 
7 YRS 
8 YRS 
10 YRS 
CHEST
19
20
21
22
23
24
24 1⁄2 
25
26
28
WAIST
19
19 1⁄2 -20 
20-21   
21 1⁄2 
22
23
24
24 1⁄2 
25
26
SHOULDER
8
81⁄2
83⁄4
9
91⁄2
10
10 1⁄2 
11
11 1⁄2 
12 1⁄2 
WAIST LENGTH 
6
7
8
9
91⁄2
10
10 1⁄2 
11
11 1⁄2 
12 1⁄2 
SHORT SLEEVE LENGTH 
23⁄4
3
31⁄4
31⁄2
4
41⁄2
43⁄4
5
51⁄2
61⁄2
LONG SLEEVE LENGTH 
61⁄2
7
8
83⁄4
91⁄2
11
11 1⁄2 
12
12 1⁄2 
13 1⁄2 
FINISHED DRESS LENGTH 
14
15
17
19
21
22
23
24
25
27

ఎంత క్లాత్ తీసుకోవాలి:

క్లాత్ ను ఎపుడు కూడా = (బాడీ పొడవు * 2 ) + కచ్చు గా మనము కొలవాలి. 
ఉదాహరణకు :
బాడీ పొడవు = 10"
కచ్చు = 2"
బాడీ పొడవు* 2 = 10* 2= 20" 
మరియు కచ్చు 2" యాడ్  చేసుకోవాలి. 
ఇపుడు మొత్తము 22" క్లాత్ కావాలి.

కావలసిన శరీర కొలతలు      


s.no
Body parts
inches


inches
Inches/2
Inches/4
       1. 
Shoulder(భుజము )



     2. 
Length (పొడవు)



     3.     
Chest round
(ఛాతి చుట్టుకోలత)



     4.     
Waist round
(నడుము చుట్టుకొలత ) 



     5.     
Waist length(నడుము పొడవు)



     6.     
Body length(బాడీ పొడవు)



      7.      
Armhole(చంక చుట్టుకోలత)













                                                                                                                                 మనము డ్రాఫ్టింగ్ ను ఎపుడు కూడా మందపాటి పేపర్ పైన మార్క్ చేసుకుంటాము. పేపర్ పైన మన బాడీ చుట్టుకొలతలలో 1/4 పార్ట్ ను మార్క్ చేస్తాము.           

0-1 = ఛాతిచుట్టుకొలత /4 + లూజు + కచ్చు 
0-2 = బాడీ పొడవు 
2-3 = భుజము/2
2-A = ఛాతి చుట్టుకొలత /12+1/2" 
3-4 = 1" షోల్డర్ డ్రాప్ 
4-5 = ఛాతి చుట్టుకొలత /4 - 1" 
5-6 = లైన్ గీయాలి 
7-8 =  ఛాతి చుట్టుకొలత /4 + లూజు  5-6 లైన్ పైన మార్క్ చేయాలి (ఇక్కడ  2-7 = 3-5)
2-B = ఛాతి చుట్టుకొలత /6 
2- c = 1 ½” 
9 అనేది 4-5 కి మిడ్ పాయింట్ 
4,9,8 కర్వ్ గీయాలి (ముందు చంక భాగము)
4, 8 వెనుక చంక భాగము గీయాలి 
0-11= నడుము చుట్టుకొలత /4 + లూజు
note : నడుము (0-11) దగ్గర డార్ట్ స్ ను కావలి అనుకుంటే 1" డార్ట్ ను యాడ్ చేసుకోవచ్చు. 
ఈ బాడీ డ్రాఫ్టింగ్ ను పట్టుపావడా  బ్లౌజ్ కి, మరియు ఫ్రాక్స్ బాడీ కు ఉపయోగించవచ్చు.

దీని ఫై గల మీ అమూల్యమైన సలహాలు, సూచనలు క్రింద కామెంట్ లో ఇవ్వగలరు
   

Tuesday, November 14, 2017

కాకరకాయ ఎండుకొబ్బరి పొడి వేపుడు

కాకరకయ వేపుడు

  1. కాకరకాయలు - 1/2 kg 
  2. వేల్లులి రెబ్బలు 10 
  3. ఉల్లిపాయలు 1 పెద్దది 
  4. ఎండుమిర్చి కారమును బట్టి 
  5. ఎండుకొబ్బరి 1 కప్పు 
  6. ఉప్పు తగినంత 
  7. నూనె 2 స్పూన్లు 
  8. పోపుదినుసులు 
  9. పసుపు పావు స్పూను 
  10. కొత్తిమీర కొంచము 




తయారు చేయు విధానము ;

1. ముందుగా కాకరకాయ వెప్పుడూ కు కావలసినవి అన్ని దగ్గర పెట్టుకోవాలి. 
2. కాకరకాయలు శుభ్రముగా కడగి పైన చెక్కు తీసుకోవాలి , చేదు ని ఇష్టపడేవాళ్లు అలానే ముక్కలుగా కట్ చేసుకోచేకోవచ్చు 
3. ఉలికిపాయాలను సన్నముక్కలుగా తరుముకోవాలి .
4. ఫ్రై పాన్ తీసుకొని అందులో కొంచం నూనె వేసుకొని నూనె వెచ్చపడిన తరువాత పొదుపుదినుసులు వేస్సుకోవాలి. 
5. ఆవాలు చిటపట అనేటప్పుడు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి, తరువాత కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని  వేగనివ్వాలి. 
6. కాకరకాయ వేగేలోపల మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి పొడి , వెల్లులి రెబ్బలు, ఎండు మిర్చి వేసుకొని పొడి చేసుకో వాలి . 
7. కాకరకాయ బాగా వేగిన తరువాత ఈ ఎండుకొబ్బరి పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి . 
8. చివరగా కొత్తిమీర వేసుకొని స్టౌ ఆపేయాలి . అంతే కాకరకాయ ఎండుకొబ్బరి పొడి వేపుడు తయారైంది 
































పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...