Thursday, February 28, 2013

మసాల బొరుగులు ( మరమరాలు)

కావలసిన పధార్థాలు :

మరమరాలు(బొరుగులు) - 200gm
టమోటా ముక్కలు          - 1cup
ఉల్లి తరుగు                     - 1cup

పుట్నాలపప్పు               -  1/4 cup
పల్లిలు                           -   1/4 cup
ధనియాల పొడి               -   1/4 tbs
ఉప్పు                            -  రుచికి తగినంత
కారం                             -    3/4 tbs
సేవ్                               -    1/4 cup
నిమ్మకాయ                   -    1 tbs

తయారు చేయువిధానము
1. ముందుగా ఒక పెద్ద బవుల్ తీసుకొని, అందులో బొరుగులు, ధనియాల పొడి, గరం మసాల, ఉప్పు, కారం, పుట్నాల పప్పు, నూనె వేసుకొని బాగ కలుపుకోవాలి.
2. ఇప్పుడు ఉల్లిపయ, టమోటా ముక్కలు వెసి కలిపి ఉప్పు, కారం ను సరిచూసుకోవాలి.
3. తరువాత పల్లీలు, సేవ్, నిమ్మరసం, చివరగ కొత్తిమీర వేసుకొని ఇంకొసారి బాగ కలిపి సర్వింగ్ బవుల్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటె సరి





Tuesday, February 26, 2013

దోస రెసిపి




కావల్సిన వస్తువులు 

మినపప్పు(ఉద్దిపప్పు)             -               1 cup

ఉప్పుడు బియ్యం(ఇడ్లి రైస్)      -               2 cups

బియ్యం (నూకలు లెదా మాములు బియ్యం)   - 2 cups

మెంతులు           -        1/4 tbs

అన్నము            -        1/4 cup

తయారు చేయూవిధానము

1 కప్ మినపప్పు, 2కప్పుల ఉప్పుడు బియ్యం, 2 కప్పుల మామూలు బియ్యం, 1/4 స్పూన్ మెంతులు అన్నింటిని కలిపి ఒక 3 గంటలు నానపెట్టుకోవాలి.

నానిన తరువాత ఒక 2 లెద 3 సారులు బాగ కడిగి, గ్రైండ్ చేసుకోవాలి. గైండ్ చేసుకునెటప్పుడు ఈ మిస్రమములో కొంచం అన్నము వేసుకొని గ్రైండ్ చేసుకుంటె హోటల్ లో చెసిన టేస్ట్ వస్తుంది.

ఇప్పుడు ఈ పిండిని కనీసం ఒక 8 గంటలు కదపకుండా అలానే రూం టెంపరేచర్ కి ఉంచితె పిండి పులుస్తుంది.
ఇప్పుడు వీటితో దోసలు వెసుకుంటె సరి. అచ్చం హోటల్ లో చెసినట్టె ఉంటాయి, మరి ప్రయత్నించి చూడండి.  

ఈ పిండితో ఇడ్లిలు కూడా పెట్టుకోవచ్చు

భొ (bow)


కావలసిన వస్తువులు:
  క్లాత్, సూది, దారం 

తయారు చేయువిధానము :
1.ముందుగా ఎదైన క్లాత్ తీసుకొని దానిని square shape లో క్రింద బొమ్మలో చూపించిన విధముగ కట్ చేసుకొని సగానికి అడ్డముగ మడుచుకోవాలి. 

2. ఇప్పుడు అంచులును సూది దారముతో రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ రావాలి, చివరిలో క్లాత్ ను తిప్పించుకోవడానికి కొంచం కుట్టకుండ కాళి ఉంచుకోవాలి క్రింద బొమ్మలో చూపించిన విధముగ .






                         

3. ఎదైన సన్నటి వస్తువుతో కుట్టుకున్న క్లాత్ ను పై భాగమునకు, కుట్లు అన్ని లోపలుకు వచ్చె విధంగా చిన్న తిప్పుకోవాలి.

                          

4.   ఇపుడు మిగిలిన ఆ అంచును కూడ కుట్టుకోవాలి. కుట్టుకున్న తరువాత ఈ క్రింద బొమ్మలో చుపించిన విధముగ వస్తుంది.

                         

5. తరువాత సూది దారముతో క్రింద బొమ్మలో చుపించినవిధముగా మధ్యలో రన్నింగ్ స్టిచ్ వెసుకొని ఆ దారాన్ని లాగి ముడి వేసుకుంటె భొ తయారవుతుంది.

6. దీన్ని కొంచం అందముగ తయారుచెసుకొవడానికి చిన్న క్లాత్ 2 ఇంచెస్ పొడవు, 1 ఇంచ్ వెడల్పు గల దానిని తీసుకొని సగానికి మడిచి రెండు అంచులని కలిపి కుట్టుకొని, పై భాగానికి తిప్పుకోవాలి.


                       

7.  ఇప్పుడు ఆ చిన్న బ్లాక్ బ్యాండు ను భొ కు మధ్యలో కుట్టుకోవాలి. పైన ఎదైన చిన్న కుందన్ పెట్టుకుంటె బాగుంటుంది



 

8.  రిబ్బన్ లేస్ల తో కుడా ఇవి తయారుచెసుకోవచ్చు. క్రింద బొమ్మలో చుపించిన విధముగ 


 





రంగవల్లులు

15-8 సందు చుక్కలు
15-8 సందు చుక్కలు 

15-8 సందు చుక్కలు 

Saturday, February 23, 2013

వాల్ హ్యంగింగ్

కావలసిన వస్తువులు 


క్రాఫ్ట్ పేపర్

సూది, దారం

చిన్న అట్ట ముక్క


తయారు చేయువిధానము :
(గమనిక:
స్టార్స్ ను తయారు చెసేవిధానమును మీరు నా బ్లాగులో 3డి పేపర్ స్టార్ వీడియోలో చూడొచ్చు. )

తయారు చేయువిధానమును ఈ క్రింద వీడియోలో చూడండి


దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

Friday, February 22, 2013

Thursday, February 21, 2013

3d పేపర్ స్టార్


స్టార్(నక్షత్రం) తయారు చేయ్యడం ఎలాగో ఇవాల చూద్దాం

కావలసిన వస్తువులు 

క్రాఫ్ట్ పేపర్స్

గ్లూ స్టిక్

దీన్ని ఎలా తయ్యారు చేయ్యాలో ఈ క్రింద వీడియోలో చూడండి


ఈ స్టార్స్ ను ఉపయోగించి ముందుముందూ మరిన్ని డెకరేటివ్ ఐటెంస్ చేద్దాం   

Wednesday, February 20, 2013

3 డి పేపర్ డెకరేషన్

3 డి పేపర్ డెకరేషన్ హాయ్ ఫ్రండ్స్ మనం పేపర్ తో 3డి డ్కరేటివ్ ఐటం ఎలా చెయ్యాలో చూద్దము


కావలసిన వస్తువులు 


క్రాఫ్ట్ పేపర్స్ - 5 చిన్న సైజ్ ( square shape)

కత్తెర

గ్లూ స్టిక్

పెన్సిల్

స్కేల్

స్టాప్లర్

తయారు చేయు విధానము

తయారు చేయు విధానమును ఈ క్రింద వీడియోలో చూడండి



దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.




         

ఫ్రాక్ 3


రంగవల్లులు

11-6 సంధు చుక్కలు
11-6 సంధు చుక్కలు 

11-6 సంధు చుక్కలు 

Wednesday, February 13, 2013

కేసరి లేదా హల్వా



కావలసిన పదార్థాలు 

బొంబాయి రవ్వ  -  1 cup

పంచదార   -  1 cup

జీడి పప్పు, లేద పల్లిలు - కొన్ని

నెయ్యి   -  5 tbs

ఫుడ్ కలర్ -  చిటికెడు

యాలకలు  - 4 or 5

నీళ్ళు   - 3 cups

తయారు చేయువిధానము 
1. ముందుగ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వెచ్చపడ్డాక 2 స్పూన్ ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వెచ్చ పడ్డాక అందులో జీడిపప్పు లేదా పల్లిలును వేసి దోరగ వేగించుకోవాలి.

2. జీడిపప్పు ను వేగించుకున్న తరువాత 1 కప్ బొంబాయి రవ్వను వేసి పచ్చివాసన పోయెంతవరుకు వెగనివ్వాలి. ఇపుడు అందులో యలకలు, 1 కప్ పంచదార వేసి 1 నిమిషం పాటు వెగించుకోవాలి.

3. ఇప్పుడు 1 కప్ బొంబయి రవ్వకు 3 కప్పుల నీళ్ళును పొసుకొని చిన్న మంట పైన  బొంబాయి రవ్వ దగ్గర పడెంతవరుకు కలుపుతూ ఉండాలి.

4. మిశ్రమము దగ్గర పడుతున్నప్పుడు ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఇపుడు మిగిలిన నెయ్యి ని కూడా ఈ మిశ్రమము లో వేసి కలుపుకొని, ఎదైన స్టీల్ ప్లేట్ కు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే ప్లేట్ లోకి తీసుకొని అన్నిపైవులా సమానముగ ఉండెటట్టు చదును చెసుకోవాలి. కొంచం చల్లబడిన తరువాత మనకు నచ్చిన షేప్స్ లో కట్ చెసుకుంటే సరి. కేసరి రెడి  


 దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

Monday, February 11, 2013

శరీర కొలతలు


మనం ఎదైన వస్త్రాలను కుట్టుకోవాలన్నా, వాటిని మన శరీరానికి తగ్గట్టు తీసుకోవాలన్న శరీర కొలతలు అవసరము.శరీర కొలతలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మీరు శరీర కొలతల పట్టికను ఈ క్రింద ఇచ్చిన విధముగా తయారు చేసుకొని మీ కొలతలను అందులో వ్రాసి పెట్టుకొని ఉపయోగించుకొవచ్చు.









                      

BUST :     చాతి చుట్టు కొలవడం

WAIST:   నడుము చుట్టూ కొలవడం

HIPS  :     నడుము క్రింది బాగము చుట్టూ కొలవడం

BUST LENGTH:   భుజము నుంచి క్రిందకు చాతి భాగము వరుకు గల పొడవు

WAIST LENGTH:  భుజము నుంచి క్రిందకు నడుము భాగము వరుకు గల పొడవు

HIPS LENGTH:    భుజము నుంచి క్రిందకు నడుము క్రింది భాగము వరుకు గల పొడవు

SHOULDER  :  భుజము మొత్తమును అంటే భుజము ఒక చివరి నుంచి ఇంకొ చివరికి

ARMHOLE   :  చంక భాగము చుట్టుకొలత (చుట్టూ కొలవాలి )

LENGTH     :   భుజము నుంచి క్రిందకు మనకు కావలసిన పొడవును తీసుకోవడం

HAND LENGTH :  భుజము చివరి భాగము నుంచి చేతి పొడవును మనకు కావలసినంత తీసుకుంటాము

HAND ROUND  : చేతి చుట్టుకొలతను తీసుకోవడం

for video please go through the below link

https://www.youtube.com/watch?v=HDwrGb4hdlw&t=63s



 దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

Sunday, February 10, 2013

ఫ్లవెర్

 పిల్లల ఫ్రాక్స్ ను ఫ్లవర్స్ తో అందముగా ఇంట్లోనే డెజైనింగ్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ ను ఎలా చేయ్యాలో చూద్దాము 


ఫ్లవెర్ తయారు చెయ్యాడానికి కావలసిన వస్తువులు 


 క్లాత్
సూది
దారం
కత్తెర







తయారు చెయ్యు విధానము :

1. ముందుగా ఎదైన పలచటి క్లాత్(సాటిన్, క్రేప్,సిల్క్ )ను తీసుకోవాలి,నేను ఇక్కడ సాటిన్ క్లాత్ తీసుకున్నాను.

2. ఇప్పుడు క్లాత్ ను మీకు కావలసిన పువ్వు సైజ్ ను బట్టి క్లాత్ ను దీర్గచతురస్రాకారంలో(రెక్టాంగులర్)కట్ చెసుకోవాలి, ఇక్కడ నేను 15 ఇంచెస్ వెడల్పు, 5 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. మీకు పెద్ద పువ్వు కావాలంటె ఎక్కువ క్లాత్ తీసుకోవాలి.


3. ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్ ను వెనుక బాగం వైపు తిప్పి సగానికి ఈ బోమ్మలో చూపించిన విధముగా మడవాలి.


4. చివరి రెండింటి అంచులను కలిపి సూది తో కుట్టుకోవాలి, క్రింద బొమ్మలో చూపించిన విధముగా.

5. తరువాత అలా కుట్టుకున్న దానిని కుట్టులు లోపల కి వచెటట్టు తిప్పుకోవాలి




6. ఇప్పుడు క్లాత్ చివరి అంచు పొడుగున  సూది తో రన్నింగ్ స్టిచ్ వెసుకుంటూ రావాలి




7.  తరువతా అదే దారముతో రెండో చివరి బాగాన్ని ఈ బొమ్మలో చూపించిన విధముగా జాఇన్ చేసి ఆ దారాన్ని లాగితే కుచ్చు కుచ్చుగా వస్తుంది. ఇపుదు రెండు చివరులను కలి స్టిచ్ చెసుకుంటే పువ్వు రెడి.



 దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...